Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు..
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు. బికనీర్‌లోని నోఖా తహసీల్‌లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారాఈ మాటని అక్షరసత్యాలుగా ప్రూవ్ చేశారు. పనా దేవి ఇటీవల పూణేలో జరిగిన 44వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2024లో పాల్గొని మూడు బంగారు పతకాలు (100మీ, షాట్‌పుట్, డిస్కస్ త్రో) గెలుచుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు పనా దేవి ఇప్పుడు ఆగస్టులో స్వీడన్‌కు వెళ్లనుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ ఫాస్ట్‌ఫుడ్, క్యాన్‌డ్ ఫుడ్, చల్లని నీరు వంటివి తీసుకోలేదన్నారు.ఇదే ఆమె ఆరోగ్య రహస్యం అని తెలిపారు.
మనవాడి ప్రోత్సాహంతో స్టేడియంకు ..
పొద్దున్నే లేవడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం వారి దినచర్యలో భాగం. అంతేకాదు తాను ఎలాంటి మందులు వేసుకోనని, ఏళ్ల తరబడి ఎలాంటి మందులు తీసుకోలేదని చెప్పింది. 92 ఏళ్ల పనా దేవి గోదార మనవడు జై కిషన్ గోదారా తన అమ్మమ్మను ఆడటానికి ప్రేరేపించాడు. జై కిషన్ జాతీయ క్రీడాకారుడు. చాలా కాలంగా, అతను ఊరిలోని పిల్లలకు వివిధ క్రీడాలలో శిక్షణ ఇస్తున్నాడు. ఒకరోజు తను చేసే పనిని గమనిస్తుందనే నెపంతో బామ్మను వాకింగ్ కోసం స్టేడియానికి తీసుకెళ్లాడు. ఆ రోజు తర్వాత నుండి అమ్మమ్మ కూడా నాతో కర్ణి సింగ్ స్టేడియానికి రావడం మొదలుపెట్టింది.
ఆ ఊరి మహిళలకు పనా దేవి స్ఫూర్తి
ఆ తర్వాత ఓ రోజు అమ్మమ్మ తనకు కూడా ఆడాలని ఉందని చెప్పింది. అమ్మమ్మ ఎంతో ఏకాగ్రతతో శిక్షణ పొంది ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది.. ఇప్పుడు ఆ ఊరి మహిళలకు స్ఫూర్తినిస్తుంది. నేషనల్ గేమ్స్ యాక్టివిటీలో పాల్గొని తిరిగొచ్చిన పనా దేవి.. ఇప్పుడు ఆ గ్రామంలోని మహిళలను గేమ్స్ యాక్టివిటీలో పాల్గొనేలా స్ఫూర్తినిస్తోంది. అమ్మమ్మ సాధించిన ఈ విజయం తర్వాత గ్రామంలోని మహిళలు ఆమెను కలవడానికి రావడం ప్రారంభించారని ఆమె మనవడు జై కిషన్ గోదార తెలిపారు. ఐదుగురు కుమారులు,ముగ్గురు కుమార్తెల తల్లి అయిన పానా దేవి ఆరోగ్యంగా ఉన్నారని గ్రామస్తులకు తెలుసని, అయితే ఆమె జాతీయ జట్టులో ఆడి గ్రామానికి కీర్తిని తెస్తుందని ఎవరూ అనుకోలేదని గోదార చెప్పారు.