Loading...
APERC Chairman: ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం
ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం

APERC Chairman: ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)నూతన చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా 70ఏళ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో ఆయన పదవీకాలం ముగుస్తుంది. బినోయ్ కుమార్‌కు పరిపాలనా రంగంలో విశేష అనుభవం ఉంది. మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012-13 మధ్య కాలంలో ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం,నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది.

ADVERTISEMENT