LOADING...
మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం
మణిపూర్‌ మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం

మణిపూర్‌‌లో మళ్లీ చెలరేగిన హింస; తుపాకీ కాల్పుల్లో ముగ్గురు మృతి, ఇళ్లు దగ్ధం

వ్రాసిన వారు Stalin
Aug 05, 2023
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శుక్రవారం అర్థరాత్రి మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలో సాయుధులు తుపాకులతో రెచ్చిపోయారు. తాజా హింసాకాండలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో తండ్రీకొడుకులు ఉన్నారని చెప్పారు. వీరిద్దరూ కూడా మైతీ కమ్యూనిటీకి చెందిన చెందిన వారే అని పోలీసులు పేర్కొన్నారు. క్వాక్తాలోని తమ ఇళ్లల్లో ముగ్గురు నిద్రిస్తున్న సమయంలో వారిని తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు చెప్పారు. అంతేకాదు, వారిని కత్తులతో కూడా నరికినట్లు వివరించారు. దాడి చేసిన వారు చురచంద్‌పూర్ నుంచి వచ్చినట్లు వారు తెలిపారు.

మణిపూర్

కుకీ వర్గానికి చెందిన ఇళ్లు దగ్ధం

కొద్దిరోజులుగా మృతులు సహాయక శిబిరంలో ఉన్నారని, అయితే పరిస్థితి మెరుగుపడిన తర్వాత శుక్రవారం క్వాక్తాలోని వారి నివాసాలకు వెళ్లినట్లు పోలీసులు వివరించారు. వారు ఇంటికి వెళ్లిన రాత్రి ఈ ఘటన దారుణం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తాజా హింసాకాండలో కుకీ వర్గానికి చెందిన అనేక ఇళ్లు కూడా దగ్ధమైనట్లు పోలీసులు వెల్లడించారు. కుకీల ఇళ్లు దగ్ధమైన తర్వాత,, క్వాక్తా వద్ద ఒక గుంపు శుక్రవారం రాత్రి గుమిగూడి, చురచంద్‌పూర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఫౌగక్‌చావో, క్వాక్తా పరిసరాల్లో రాష్ట్ర బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కొందరు సాయుధులు ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిని కాల్చి చంపినట్లు పేర్కొన్నారు.