LOADING...
BJP first list: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 144 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 144 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల

BJP first list: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: 144 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌, కేరళ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన వెంటనే భాజపా తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపుర్‌ నియోజకవర్గానికి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పేరును పార్టీ ఖరారు చేసింది. అంతేకాదు, ఆయన నందిగ్రామ్‌ నుంచీ కూడా పోటీ చేయనున్నారు. కోల్‌కతా హృదయభాగంలో ఉన్న భవానీపుర్‌ నియోజకవర్గం 2011 నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌కు బలమైన కోటగా కొనసాగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

144 అభ్యర్థుల తొలి జాబితా విడుదల

వివరాలు 

కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగానూ 47మంది అభ్యర్థుల తొలి జాబితా 

ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగానూ భాజపా47మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేమమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్‌కూ తొలి జాబితాలో స్థానం లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీకి ఎదురు నిలిచి ఓడిపోయిన నవ్య హరిదాస్‌ను కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా రంగంలోకి దింపింది. కేరళలో మొత్తం 140అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిదశలో ఏప్రిల్‌ 23న 152 స్థానాలకు,రెండో దశలో ఏప్రిల్‌ 29న 142సీట్లకు ఓటింగ్‌ జరగనుంది.

Advertisement