Page Loader
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ 
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ

బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ 

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి. దిల్లీలోని అమిత్ షా నివాసంలో శనివాసం ఉదయం దాదాపు 50నిమిషాల పాటు జరిగిన చర్చల అనంతరం సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలోకి చంద్రబాబు రావడంతో ఇరు వర్గాలు త్వరలో సోషల్ మీడియాలో వేదికగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జనసేన, బీజేపీకి కలిపి 8లోక్‌సభ సీట్లను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. ఈ ఎనిమిది సీట్లలో బీజేపీ 6, జనసేన రెండు సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ సీట్లలో బీజేపీ 6-8 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6 లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీ!