NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
    అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

    Ramesh Bidhuri: అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారంటూ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    01:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించుకుంటున్న తరుణంలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష బిజేపీ మధ్య మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది.

    ఈ సందర్భంలో బిజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    ఈసారి ఆయన దిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్‌ చేస్తూ, ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్‌ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.

    అతిషి తల్లిదండ్రుల వైఖరిని భారత్‌ వ్యతిరేకంగా సూచిస్తూ, అఫ్జల్‌ గురును కాపాడేందుకు వారు ప్రయత్నించారని తెలిపారు.

    ఇక, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజేపీ తరఫున రమేష్ బిదూరి, ముఖ్యమంత్రి అతిషి మార్లేనాతో పోటీ పడనున్నారు.

    Details

    ఫిబ్రవరి 8న ఫలితాలు

    ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరుగనుండగా, 8వ తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి.

    ఈ క్రమంలో రమేష్ బిదూరి వరుసగా ముఖ్యమంత్రి అతిషి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

    ఇటీవల, అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి 'అతిషి సింగ్'గా నామకరణం చేసుకున్నారని ఆరోపించారు.

    మరోసారి దిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దిల్లీ బిజేపీ సీఎం అభ్యర్థిగా రమేష్ బిదూరి అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అతిషి మార్లెనా
    దిల్లీ

    తాజా

    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్
    Mohammed Shami : టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌.. మండిపడ్డ మహ్మద్‌ షమీ..! మహ్మద్ షమీ
    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం  ద్రౌపది ముర్ము

    అతిషి మార్లెనా

    Delhi Water Crisis: క్షిణించిన అతిషి ఆరోగ్యం.., ఆస్పత్రికి తరలింపు  భారతదేశం
    Coaching Centres: కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టం  భారతదేశం
    Atishi Marlena: ఏపీలో టీచర్‌ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే! భారతదేశం
    Atishi: సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం  భారతదేశం

    దిల్లీ

    Delhi March: రైతుల చలో దిల్లీ కార్యక్రమం.. పోలీసుల అడ్డంకులు.. సరిహద్దుల్లో ఉద్రిక్తత ఇండియా
    Farmers March: శంభు సరిహద్దు వద్ద రైతులపై టియర్‌ గ్యాస్‌.. 17 మందికి గాయాలు హర్యానా
    Air Pollution: దిల్లీలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం.. 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ వాయు కాలుష్యం
    Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ వాయు కాలుష్యం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025