
Rajiv Pratap Rudy: విమానంలో కో పైలట్‌గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎప్పుడూ ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు, తమలో దాగి ఉన్న ఇతర ప్రతిభకు కూడా అప్పుడప్పుడు సమయం కేటాయిస్తుంటారు. తాజాగా అలాంటి సంఘటనలో బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కో పైలట్‌గా వ్యవహరించడం విశేషంగా మారింది. రూడీ ప్రతిభను ప్రశంసిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
అసలేం జరిగింది?
పట్నా నుంచి దిల్లీకి బయలుదేరిన విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్నారు. అదే విమానంలో కో పైలట్‌గా రూడీ ఉండటం ఆయనను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన అనుభవాన్ని చౌహాన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. చౌహాన్ స్పందన "రాజీవ్.. ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. పట్నా నుంచి దిల్లీకి ఈ ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. \ఎందుకంటే నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ విమానానికి కో పైలట్‌గా ఉన్నారంటూ చౌహాన్ పోస్ట్ చేశారు. దీనికి తోడు, విమానంలో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న ఫొటోలు, అలాగే రూడీపై ప్రశంసలు కురిపించిన చేతిరాత లేఖను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Details
రూడీపై ప్రశంసల వర్షం
తన లేఖలో చౌహాన్ ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. బిజీ రాజకీయ షెడ్యూల్ ఉన్నప్పటికీ, తమలో ఉన్న ప్రతిభకు సమయం కేటాయించడం గొప్ప విషయమని రూడీని ప్రశంసించారు. అలాగే ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చినందుకు రూడీకి కృతజ్ఞతలు తెలిపారు. రూడీ రాజకీయ ప్రయాణం బిహార్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూడీ, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు తన కో పైలట్ ప్రతిభతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.