
రాహుల్ గాంధీపై బీజేపీ పాట.. ప్రేమ మనసులో ఉంటుంది, దుకాణాల్లో కాదు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ ఒకే రకమైన విఫల ఉత్పత్తిని పదేపదే తీసుకొస్తోందని ఎద్దేవా చేశారు.
అయితే ఈ విఫల ఉత్పత్తికి ప్రచార కర్తలు(రాహుల్ గాంధీ) ప్రేమ దుకాణం అని పేరు పెట్టారు. ప్రజలు మాత్రం దాన్ని లూటీల దుకాణం,అబద్ధాల దుకాణంగా నిర్ణయించారంటూ చురకలు అంటించారు.
ఈ మేరకు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన ప్రసంగాల్లోనే మాటలనే పాటలుగా మల్చిన బీజేపీ ఓ పాటను రిలీజ్ చేసింది.
ప్రేమ మనసులో ఉంటుందని, దుకాణాల్లో కాదని పాట ద్వారా హితవు పలికారు. ప్రేమను సంపాదించుకోవాలి కానీ విక్రయించకూడదంటూ రాహుల్ గాంధీని సుతిమెత్తగా విమర్శించింది.
DETAILS
అన్ని అరిష్టాలకు మూలం కాంగ్రెస్సే : ప్రధాని మోదీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. మీరో దుకాణాన్ని తెరిచారు, అందులో ద్వేషం ఉంది. కుంభకోణాలు సైతం ఉన్నాయి.
మీ మనసు అంధకారంతో నిండిపోయింది, దశాబ్దాలుగా భారతదేశం మీ కుటుంబవాదంతో నలిగిపోయింది.
ప్రేమ మనసుల్లో ఉంటుంది, దుకాణాల్లో కాదని ప్రజలంతా అంటున్నారు. ప్రేమను సంపాదించుకోవాలి కానీ విక్రయించకూడదంటూ ఈ పాట సాగింది.
లోక్‌సభలో ప్రధాని మోదీ ఏక ధాటిగా చేసిన ప్రసంగంలో అన్ని అరిష్టాలకు కాంగ్రెస్సే మూలమని మండిపడ్డారు.
ఎమర్జెన్సీ, దేశ విభజన, రాజ్యాంగానికి అవమానం, అసత్యాలు, ఇవన్నీ కాంగ్రెస్ దుకాణంలోనివే అంటూ దెప్పిపొడిచారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.