NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!
    తదుపరి వార్తా కథనం
    విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!
    విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!

    విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 10, 2023
    08:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని, ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్‌లో పరిస్థితి మారిందని, దీనిపై విపక్షాలకు చర్చ అవసరం లేదన్నారు.

    హైకోర్టు తీర్పులో రెండు కోణాలున్నాయన్నారు. మణిపూర్ లో ఏం జరిగిందో నిన్న వివరంగా అమిత్ షా చెప్పారని, మళ్లీ మణిపూర్‌లో అలాంటి ఘటనలు జరగకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదని విమర్శించారు.

    మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత గురించి అమిత్ షా సవివరంగా సభ ముందు ఉంచారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

    Details

    కాంగ్రెస్ దేశానికి ద్రోహం చేసింది : ప్రధాని మోదీ

    కాంగ్రెస్ చరిత్ర అంతా భారతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందని, మిజోరం మీద ఇందిరాగాంధీ హయంలో జరిగిన వాయుసేన దాడిని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారా అంటూ మోదీ చురకలంటించారు.

    మార్చి 5న ఇప్పటికి మిజోరం నిరసన దినంగా భావిస్తారని, ఆ దాడి గాయాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మరిచిపోలేదని ఆయన గుర్తు చేశారు.

    మణిపూర్ ఘటనలో దోషులను శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోదీ చెప్పుకొచ్చారు.

    2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం, 2018లో మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టారని ఇన్ని అవిశ్వాసాలతో ఏం సాధిస్తారని ప్రతిపక్షాలను మోదీ ప్రశ్నించారు.

    బీజేపీ అభివృద్ధిని గుర్తించి 2019లో తమకు సంపూర్ణ అధికారాన్ని దేశ ప్రజలు ఇచ్చారని, తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణాన్ని అయినా చూపించగలరా ఆయన సవాల్ విసిరారు.

    Details

    అవినీతి పార్టీలన్నీ ఒకే చోటుకు చేరాయి : మోదీ

    కాంగ్రెస్‌ది అబద్దాల దుకాణమని, సైన్యం ఆత్మాభిమాన్ని కాంగ్రెస్ అమ్మేసిందని ప్రధాని మోదీ విమర్శించారు.

    తాము దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు వ్యాపింపజేశామని, స్కామ్ లు లేని భారత్ ను అందించామని, దీంతో ప్రపంచ దేశాల్లో తమపై ఓ నమ్మకంపై ఏర్పడిందన్నారు.

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఐఎంఎఫ్ ప్రశంసించిందని గుర్తు చేశారు.

    అవినీతితో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, వాళ్లకి అధికార దాహమే ఆలోచనగా ఉండిపోయిందని మోదీ వెల్లడించారు.

    ఇండియాలో జరిగిన మంచిని విపక్షాలు సహించలేకపోతున్నాయని, HAL దివాళా తీస్తుందని ప్రచారం చేశారని, కానీ హెచ్ఏఎల్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని మోదీ వివరించారు.

    Details

    కుటుంబ రాజకీయాలంటే కాంగ్రెస్ కు ఇష్టం 

    రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

    ఇండియా కూటమి పేరుతో మళ్లీ 16 పార్టీలు ఒకే ఏకతాటిపైకి వచ్చాయని, ఎన్ని పార్టీలు వచ్చినా ఓడిపోవడం ఖాయమని మోదీ స్పష్టం చేశారు.

    గాంధీ నుంచి అంబేద్కర్ వరకు కుటుంబ రాజకీయాలు వద్దు అని చెప్పారని, కానీ కుటుంబ రాజకీయాలు, దర్బారు రాజకీయాలు కాంగ్రెస్ కు ఇష్టమని మోదీ ఆరోపించారు.

    ఓడిషాలో 28 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, నాగాలాండ్‌లో 1988లో చివరిసారిగా కాంగ్రెస్ గెలిచిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మణిపూర్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    ఫ్రాన్స్ ఎన్ఆర్ఐలకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలోనే ఈఫిల్‌ టవర్ నుంచి యూపీఐ సేవలు  ఫ్రాన్స్
    భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్ ఫ్రాన్స్
    భారత అంతరిక్షానికే చంద్రయాన్‌-3 మైలురాయి.. ఇస్రో సైంటిస్టులకు గుడ్‌లక్‌ చెప్పిన మోదీ   భారతదేశం
    అట్టహాసంగా బాస్టిల్ డే పరేడ్.. అద్భుత విన్యాసాలు వీక్షించిన మోదీ, మాక్రాన్  ఫ్రాన్స్

    మణిపూర్

    మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ భారతదేశం
    మణిపూర్ ఘటన.. ప్రధాన నిందితుడి ఇంటిని కాల్చేసిన స్థానికులు సుప్రీంకోర్టు
    మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు: పోరుగు రాష్ట్రాల నుంచి డీఐజీ స్థాయి అధికారుల నియామకం  నాగాలాండ్
    మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025