రసాభసాగా పార్లమెంట్.. నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-2023 నేటితో ముగియనున్నాయి. జులై 20న ప్రారంభమైన సమావేశాలు తొలి రోజుల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మణిపూర్ అల్లర్లపై ప్రత్యేక రూల్ కింద చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి.పార్లమెంట్ కు ప్రధాని మోదీ రావాలని, మణిపూర్ హింసకాండపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీనిపై అధికారపక్షం ససేమిరా అనడంతో ఇండియా కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని మోదీ దాదాపు 2 గంటలకుపైనే మాట్లాడినా మణిపుర్ అంశం కాకుండా కేవలం రాజకీయ విమర్శలే చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ సస్పెష్షన్ పై రాజ్యసభలో ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ జీఎస్టీ బిల్లుకు సవరణలు చేసే అవకాశం ఉంది.