LOADING...
Ramachander Rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు

Ramachander Rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన ఆయనను తార్నాకలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్‌రావు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులు ముందుగా ఆయనను గృహ నిర్బంధం చేశారు. అనంతరం కూడా బయల్దేరే ప్రయత్నం చేయడంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు-బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement