LOADING...
Mumbai: బ్లింకిట్ డెలివరీ బాయ్ దుశ్చర్య.. మహిళపై అనుచిత ప్రవర్తన 
బ్లింకిట్ డెలివరీ బాయ్ దుశ్చర్య.. మహిళపై అనుచిత ప్రవర్తన

Mumbai: బ్లింకిట్ డెలివరీ బాయ్ దుశ్చర్య.. మహిళపై అనుచిత ప్రవర్తన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. పెద్దలు కూడా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. కానీ తాజాగా ముంబైలో జరిగిన ఒక సంఘటన ఈ పాఠాన్ని విరుద్ధంగా చూపించింది. డెలివరీ బాయ్, డెలివరీ చేసేందుకు ఇంటికొచ్చి, మహిళను అనుచితంగా తాకాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Details

సంఘటన వివరాలు

ముంబైకి చెందిన మహిళ ఒక బ్లింకిట్ ఆర్డర్ బుక్ చేసింది. డెలివరీ సమయంలో డెలివరీ బాయ్ వస్తువులు ఇవ్వగా మహిళ వక్షోజాలను ఉద్దేశపూర్వకంగా తాకాడు. ఎవరూ చూడడం లేదనేమో, లేదా మహిళ ఒంటరిగా ఉన్నందునా ఆమె డబ్బులు ఇస్తున్న సమయంలో కుడి హస్తాన్ని ఆమె ఛాతీపై పెట్టి తాకాడు. దీంతో మహిళ అవాక్కై దూరంగా నిలిచింది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Details

బాధిత మహిళ చర్యలు

బాధిత మహిళ ఈ అవమానాన్ని వీడియోతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లింకిట్ డెలివరీ బాయ్ తనను అనుచితంగా తాకాడని వివరించింది. ఆమె బ్లింకిట్ సంస్థను కూడా లోపల చిరునామా అడిగి తనపై జరిగిన సంఘటనకు చింతిస్తున్నామని, ఏవైనా సహాయం కావాలంటే అందిస్తామని వెల్లడించింది. ఈ స్పందనపై మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్లాట్‌ఫామ్ నుంచి వైదొలిగింది.

Detais

నెటిజన్ల స్పందన ఇదే

వీడియో వైరల్ అవ్వడంతో ముంబై పోలీసులు స్పందించారు. బాధిత మహిళకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని, తనతో కలిసి వివరాలు తెలుసుకుంటామని ఎక్స్‌లో తెలిపారు. ఇక, నెటిజన్లు బాధిత మహిళకు మద్దతు చూపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.