
Mount Everest: మౌంట్ ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం..చిక్కుకున్న 1000 మంది
ఈ వార్తాకథనం ఏంటి
మౌంట్ ఎవరెస్ట్ పరిసరాల్లో మంచు తుపాన్ భయంకరంగా విరుచుకుపడింది. టిబెట్ వైపు 16 వేల అడుగుల ఎత్తులో భారీ హిమపాతం సంభవించడంతో సుమారు వెయ్యి మంది వరకు చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక ప్రజలు కూడా సహాయం కోసం ముందుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం మొదలైన మంచు తుపాన్ శనివారం నాటికి మరింత తీవ్రరూపం దాల్చింది. దాంతో ఆ ప్రాంతంలోని రహదారులన్నీ మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి.విషయం తెలిసిన వెంటనే స్థానిక అధికారులు,రక్షణ సిబ్బంది క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ప్రారంభించారు. మంచుతో కప్పబడిన ఎవరెస్ట్ క్యాంప్‌లకు వెళ్లే మార్గాలను శుభ్రం చేస్తూ,చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.
వివరాలు
51 మంది మృతి
ప్రస్తుత పరిస్థితుల్లో సందర్శకులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే నేపాల్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరుస వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, వరదలు రోడ్లు, ఇళ్లు ముంచెత్తుతున్నాయి. ఈ దుర్ఘటనల్లో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విపత్తు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఐలం జిల్లాలోనే 37 మంది మరణించినట్లు సమాచారం.