IndiGo flight bomb threat: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 17, 2026
08:46 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విమానంలో హైదరాబాద్కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విమానంలో బాంబు ఉందంటూ ఓ విద్యార్థి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించారు. అనంతరం విమానంలో బాంబు ఉందనే సమాచారంపై అప్రమత్తమైన అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయ వర్గాలు అప్రమత్తమయ్యాయి.