
Bomb Threats: విదేశీ ఎంబసీలు, ఇళయరాజా స్టూడియోకు బాంబ్ బెదిరింపులు.. పోలీసులు అప్రమత్తం!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల కాలంలో ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు బాంబ్ బెదిరింపులు (Bomb Threats In Chennai) జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలోని పలు విదేశీ రాయబార కార్యాలయాలు, అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై, దర్యాప్తు ప్రారంభించి, అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబ్ పేలుళ్లు జరగనున్నట్లు మెయిల్స్ వచ్చాయని తెలుస్తోంది.
Details
నకిలీ బెదిరింపుగా నిర్ధారణ
ఈ సెక్యూరిటీ ఆలోచనలతో పోలీసులు ముమ్మరంగా సోదాలు ప్రారంభించారు. ఇంకా చెన్నై టి.నగర్‌లోని ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబ్ బెదిరింపు వచ్చింది. డీజీపీ ఆఫీసు, ఇళయరాజాకు మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు చేరాయన్నారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ స్టూడియోకు చేరి తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో దీనిని నకిలీ బెదిరింపుగా నిర్ధారించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ మెయిల్ అడ్రస్‌తో గత కొన్ని వారాల్లో చెన్నైలోని పలువురు వీఐపీలకు కూడా ఇదే తరహా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.