Page Loader
ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి

వ్రాసిన వారు Stalin
Apr 26, 2023
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై నక్సల్స్ ఐఈడీ దాడిలో మొత్తం 11 మంది సిబ్బంది మరణించారు. ఈ ఘటనను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ దృవీకరించారు. ఇది చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దంతెవాడలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు క్యాడర్ ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ దళం కూంబింగ్ నిర్వహిస్తుండగా, నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి, 10మంది డీఆర్‌జీ జవాన్లు, డ్రైవర్‌ వీరమరణం పొందినట్లు సీఎం చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నక్సల్స్ దాడిని దృవీకరించిన ఛత్తీస్‌గఢ్ సీఎం బఘెల్