Loading...
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే
బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే

BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ కీలక సమావేశాల కోసం ప్రపంచంలోని పలుదేశాల అగ్రనేతలు, ఉన్నతస్థాయి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహా ప్రముఖ నాయకులు ఈ సదస్సులో పాల్గొననుండటంతో రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వివరాలు 

భారత్‌కు చేరుకున్న ప్రముఖ అతిథులు

బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఇప్పటికే భారత్‌కు వచ్చారు.

బ్రెజిల్ తరఫున విదేశాంగ మంత్రి మౌరో వీరా హాజరుకానున్నారు.

కొత్తగా బ్రిక్స్‌లో చేరిన ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల అధినేతలు, ప్రతినిధులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

వీరితోపాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) అధిపతులు కూడా సదస్సులో పాల్గొననున్నారు.

వివరాలు 

విదేశీ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు

అగ్రనేతలకు ఆతిథ్యం ఇస్తున్న ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లు వారి బస, ఆహారం, భద్రతతోపాటు ఇతర అవసరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు సమష్టి పరిష్కారాలను అన్వేషించడంపై దృష్టి పెట్టనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రపంచ సవాళ్లపై ప్రధానంగా చర్చ

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బ్రిక్స్ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,పశ్చిమాసియా సంక్షోభం,ముఖ్యంగా హార్ముజ్ జలసంధికి సంబంధించిన పరిణామాలు,అమెరికా వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో సభ్యదేశాలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నాయి.

ఆహార భద్రత,ఇంధన రంగంలో పరస్పర సహకారం, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం,విపత్తుల నివారణ వంటి అంశాలు చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.

అంతేకాకుండా కీలక వస్తువుల సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠంగా,సంక్షోభాలను తట్టుకునేలా రూపొందించడంపైనా సభ్యదేశాలు దృష్టి సారించనున్నాయి.

ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్‌ను మరింత ప్రభావవంతమైన అంతర్జాతీయ శక్తిగా నిలబెట్టాలని భారత్ భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

మోదీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటీ

ఈ దిశగా సదస్సులో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం ఉండనుంది.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.

మూడు రోజుల పర్యటన కోసం పుతిన్ గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ భేటీలో భారత్-రష్యా సంబంధాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

వివరాలు 

మోదీ-పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటీ

ముఖ్యంగా రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టనున్నారు.

భారత్-రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలను కూడా మోదీ, పుతిన్ పరిశీలించనున్నారు.

దీంతో బ్రిక్స్ సదస్సుతోపాటు ఈ ద్వైపాక్షిక భేటీపై కూడా అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT