Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్ నిర్దోషి.. లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన కోర్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 03, 2026
11:47 am
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ (Brij Bhushan Singh)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ తోమర్‌ను కూడా దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, అలాగే బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసాలు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. కేసును కొట్టివేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.