మైనంపల్లి ఇంటికి వేలాదిగా తరలి వెళ్ళిన బీఆర్ఎస్ శ్రేణులు: తన భవిష్యత్ కార్యచరణపై మైనంపల్లి క్లారిటీ
ధూలపల్లి లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటికి కార్యకర్తలు, కార్ఫోరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్ళారు. తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మెదక్ అసెంబ్లీ టికెట్ రాకపోవడానికి హరీష్ రావు కారణమంటూ మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసారు. మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణ విషయమై కార్యకర్తలతో ముచ్చటించారు మైనంపల్లి. ప్రస్తుతానికి తాను ఏమీ మాట్లాడనని, వారం రోజుల తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియజేస్తానని, ఈ వారం రోజుల పాటు మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తానని అన్నారు.
పార్టీని వీడి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం?
కొడుకు రోహిత్ కు బీఆర్ఎస్ నుండి మెదక్ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో మైనంపల్లి ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని మైనంపల్లి వీడే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీని వీడి, మెదక్ అసెంబ్లీ నుండి కొడుకును స్వతంత్రంగా నిలబెట్టి తాను కూడా స్వతంత్రంగా నిలబడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తన భవిష్యత్ ప్లానింగ్ విషయమై ఎలాంటి మాటలు మాట్లాడలేదు. వారం రోజుల తర్వాత మీడియాతో మాట్లాడతాననీ, అప్పటివరకూ మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని మైనంపల్లి అన్నారు.