India Bullet Train: 2027 నుంచే భారత్‌లో బుల్లెట్ ట్రైన్.. తొలుత ముంబై-వాపి మధ్య సర్వీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు కొన్నేళ్లుగా ఉన్న బుల్లెట్ ట్రైన్ కల సాకారమయ్యే సమయం దగ్గరపడింది. దేశంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసులు 2027 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలుత ముంబై-వాపి మధ్య రైలు సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా పూర్తి కారిడార్‌ను నిర్మిస్తామని చెప్పారు.
వివరాలు
బుల్లెట్ ట్రైన్ పనుల్లో వేగం
శుక్రవారం సబ్‌స్టాక్ బ్లాగ్‌లో చేసిన పోస్ట్‌లో రైల్వే మంత్రి బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు.
సెప్టెంబర్ నాటికి 456 కిలోమీటర్ల మేర పిల్లర్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. అలాగే 206 కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.
మిగిలిన పనులన్నీ వేగంగా కొనసాగుతున్నాయని తన పోస్ట్‌లో తెలిపారు.
వివరాలు
స్వదేశీ టెక్నాలజీతో బీ28 రైలు తయారీ
బీ28 రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నాయి.
ఈ రైలు తయారీలో పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నే వినియోగిస్తున్నాయి.
బీ28 రైలు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
557 మంది ప్రయాణికులకు అవకాశం
ఈ రైలు మొత్తం 202 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 8 కోచ్‌లు ఉండగా.. ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు.
దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలు కల్పించేలా రైలు లోపలి బోగీలను రూపొందించారు.