Loading...
Jensen Huang: ఎన్విడియా మాజీ సీఈఓకు సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వండి.. బోర్డుకు ట్రంప్‌ సూచన
ఎన్విడియా మాజీ సీఈఓకు సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వండి.. బోర్డుకు ట్రంప్‌ సూచన

Jensen Huang: ఎన్విడియా మాజీ సీఈఓకు సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వండి.. బోర్డుకు ట్రంప్‌ సూచన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు తిరిగి సంస్థ పగ్గాలు అప్పగించాలని పలువురు ఉద్యోగులు, టెక్‌ రంగ ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఆయన పునర్నియామకానికి మద్దతు తెలిపారు. జెన్సన్‌కు మరో అవకాశం ఇచ్చి సీఈఓగా తిరిగి నియమించుకోవాలని ఎన్విడియా బోర్డుకు సూచించారు. ప్రపంచంలోని అత్యంత మేధావుల్లో ఒకరైన జెన్సన్‌ సేవలు టెక్‌ రంగానికి అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికాకు ఎన్విడియా అత్యంత కీలకమైన కంపెనీ అని ట్రంప్‌ పేర్కొన్నారు. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జెన్సన్‌ మంచి మనిషి. ఆయన తన తప్పును అంగీకరించి, సంస్థకు క్షమాపణ చెప్పి తిరిగి విధుల్లో చేరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన అద్భుతమైన చిప్‌లను రూపొందించారు.

వివరాలు

మూడో స్థానం నుంచి దిగజారిన ఎన్విడియా

ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జెన్సన్‌ గురించి చర్చించాను. ఆయన కూడా జెన్సన్‌ను గొప్ప మేధావిగా అభివర్ణించారు'' అని ట్రంప్‌ వెల్లడించారు.

జెన్సన్‌ తొలగింపు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా షేర్లు శుక్రవారం మరింత క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు 3.4 ట్రిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

ఫలితంగా అమెరికాలో మూడో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న స్థానాన్ని ఎన్విడియా కోల్పోయింది.

గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ మార్కెట్‌ విలువ పరంగా ఎన్విడియాను అధిగమించింది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ మాత్రం అమెరికాలో అత్యంత విలువైన కంపెనీలుగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT