Loading...
Shubman Gill: కోహ్లి, రోహిత్‌లను వెనక్కి నెట్టిన గిల్‌.. డబ్ల్యూటీసీలో సరికొత్త రికార్డు!
కోహ్లి, రోహిత్‌లను వెనక్కి నెట్టిన గిల్‌.. డబ్ల్యూటీసీలో సరికొత్త రికార్డు!

Shubman Gill: కోహ్లి, రోహిత్‌లను వెనక్కి నెట్టిన గిల్‌.. డబ్ల్యూటీసీలో సరికొత్త రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) చరిత్రలో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెల్లింగ్టన్‌లోని బేసిన్‌ రిజర్వ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గిల్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 43వ మ్యాచ్‌లోని 77వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు నమోదు చేశాడు. ప్రస్తుతం గిల్‌ 93 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.

వివరాలు

డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు

ఈ రికార్డుతో డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో గిల్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో రిషభ్‌ పంత్‌ 2,978 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ 2,716, రవీంద్ర జడేజా 2,675, యశస్వి జైస్వాల్‌ 2,673, విరాట్‌ కోహ్లి 2,617 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వివరాలు

డబ్ల్యూటీసీలో టాప్‌-5 పరుగుల వీరులు

ఓవరాల్‌గా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో గిల్‌ 12వ స్థానంలో ఉన్నాడు. టాప్‌-5 బ్యాటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

జో రూట్‌ - 6,815 పరుగులు

స్టీవ్‌ స్మిత్‌ - 4,804 పరుగులు

మార్నస్‌ లబూషేన్‌ - 4,651 పరుగులు

ట్రవిస్‌ హెడ్‌ - 4,200 పరుగులు

బెన్‌ స్టోక్స్‌ - 3,857 పరుగులు

ADVERTISEMENT

వివరాలు

భారత్‌ 110 పరుగుల ఆధిక్యం

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి భారత్‌ 110 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

గిల్‌తో పాటు రిషభ్‌ పంత్‌ (48) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత స్కోర్‌ 479/3గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (136) సూపర్‌ సెంచరీతో అదరగొట్టాడు.

యశస్వి జైస్వాల్‌ (85), దేవదత్‌ పడిక్కల్‌ (80) సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది.

ఆ జట్టు తరఫున హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్‌దీప్‌ మూడు, అన్షుల్‌ కంబోజ్‌ రెండు, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు.

ADVERTISEMENT