Loading...
Visakhapatnam: బ్రిక్స్‌ దేశాల సైకిల్‌ ర్యాలీతో విశాఖ బీచ్‌ రోడ్‌లో సందడి!
బ్రిక్స్‌ దేశాల సైకిల్‌ ర్యాలీతో విశాఖ బీచ్‌ రోడ్‌లో సందడి!

Visakhapatnam: బ్రిక్స్‌ దేశాల సైకిల్‌ ర్యాలీతో విశాఖ బీచ్‌ రోడ్‌లో సందడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం బీచ్‌ రోడ్‌లో బ్రిక్స్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్‌ సైకిల్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులతో పాటు ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సైకిళ్లు తొక్కుతూ క్రీడాకారులు, యువతను ఉత్సాహపరిచారు. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు పలు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన క్రీడా ప్రతినిధులు, యువజన మంత్రులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

వివరాలు

పర్యావరణాన్ని ప్రోత్సహించాలి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ.. బ్రిక్స్‌ దేశాల మధ్య సాంకేతికత, క్రీడలు, నైపుణ్యాల భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

కాలుష్య నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు సైకిల్‌ ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.

విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా రానున్న కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు మాండవీయ తెలిపారు.

ADVERTISEMENT