LOADING...
CA Exams 2026: మే 5 నుంచి సీఏ ఇంటర్ పరీక్షలు.. ఫైనల్ ఎగ్జామ్స్‌పై ఐసీఏఐ కీలక నిర్ణయం
మే 5 నుంచి సీఏ ఇంటర్ పరీక్షలు.. ఫైనల్ ఎగ్జామ్స్‌పై ఐసీఏఐ కీలక నిర్ణయం

CA Exams 2026: మే 5 నుంచి సీఏ ఇంటర్ పరీక్షలు.. ఫైనల్ ఎగ్జామ్స్‌పై ఐసీఏఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
04:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీఏ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక అప్‌డేట్ ఇచ్చింది. సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల నిర్వహణపై ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 3 నుంచి ప్రారంభం కావాల్సిన సీఏ ఇంటర్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ మే 5 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సీఏ ఇంటర్ గ్రూప్-1పరీక్షలు మే 5, 7,9 తేదీల్లో నిర్వహించబడతాయి. గ్రూప్-2 పరీక్షలు మే 11, 13, 15 తేదీల్లో జరుగుతాయి. అయితే ఫౌండేషన్‌, ఫైనల్‌, పీక్యూసీ (INTT-AT) పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని ఐసీఏఐ వెల్లడించింది.

వివరాలు

పరీక్షలు ఏడాదికి రెండుసార్లు మాత్రమే

అభ్యర్థులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించాలని సూచించింది. ఇదిలా ఉండగా, సీఏ ఫైనల్ పరీక్షల విషయంలో కూడా ఐసీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పరీక్షలను ఏడాదికి కేవలం రెండుసార్లే నిర్వహించనుంది. మే సెషన్ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తున్న పరీక్షలను ఇకపై మే, నవంబర్ నెలలకు మాత్రమే పరిమితం చేయనుంది. విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ జాయింట్ డైరెక్టర్ (ఎగ్జామినేషన్స్) ఆనంద్ కుమార్ చతుర్వేది తెలిపారు. ఈ మార్పులు పరీక్షా నిర్వహణలో స్పష్టతను తీసుకురావడంతో పాటు విద్యార్థులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాయని భావిస్తున్నారు.

Advertisement