7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్
వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన సంచలన ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించామని, మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఠాకూర్ అన్నారు. వారం రోజుల్లో ప్రతి భారతదేశంలోని CAAని అమలు చేస్తామన్నారు. డిసెంబర్ 31, 2014కి ముందు భారతదేశానికి బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వాన్ని అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సీఏఏను తీసుకొచ్చింది.
బీజేపీ అందించే గుర్తింపు కార్డులను అంగీకరించవద్దు: బెంగాల్ మమతా
శంతను ఠాకూర్ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ తిప్పికొట్టారు. అందరినీ భయపెట్టి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ అనుకుంటోందని మండిపడ్డారు. సీఏఏను బీజేపీ రాజకీయానికి వాడుకుంటోందన్నారు. బీజేపీ అందించే గుర్తింపు కార్డులను అంగీకరించవద్దని సరిహద్దు ప్రాంతాల ప్రజలను మమతా కోరారు. బీజేపీ ఇచ్చే నకిలీ కార్డు తీసుకోవద్దని, తమ వద్ద ఓటర్ ఐడీ కార్డు ఆధార్ కార్డు ఉందని చెప్పాలన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా కూడా శంతను ఠాకూర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రాంతంలో సీఏఏను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదని నొక్కి చెప్పారు.