Ocean Winner: బంగాళాఖాతంలో మునిగిన సరకు నౌక
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'ఓషన్ విన్నర్' అనే సరకు రవాణా నౌక శనివారం సముద్రంలో మునిగిపోయింది. ఈ నౌక ఒడిశా నుంచి 72 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని సింగపూర్‌కు తరలిస్తోంది. గురువారం రాత్రి ఒడిశా నుంచి బయలుదేరిన నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 20 మంది చైనా పౌరులు కాగా.. ముగ్గురు మయన్మార్‌కు చెందినవారు, ఒకరు బంగ్లాదేశ్ పౌరుడు ఉన్నారు. పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో నౌక మునిగిపోయినట్లు సమాచారం అందడంతో భారత తీరగస్తీ దళం, నౌకాదళం వెంటనే రంగంలోకి దిగాయి.
వివరాలు
సిబ్బంది కోసం గాలింపు చర్యలు
సమీపంలో ప్రయాణిస్తున్న ఇతర నౌకలకు కూడా సమాచారం అందించి.. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరాయి.
సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు ఇద్దరిని నీళ్ల నుంచి ప్రాణాలతో రక్షించగలిగారు.
మిగిలిన సిబ్బంది ఆచూకీ కోసం భారత తీరగస్తీ దళం, నౌకాదళం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.