Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదవ్వగా, తాజాగా మరో యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
హర్ష సాయి అనేక సెక్షన్ల కింద బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు కేసు నమోదైనట్లు తెలిపారు.
Details
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై సజ్జనార్ హెచ్చరిక
తాను మొత్తం బెట్టింగ్ మాఫియాతోనే పోరాడుతున్నానని సజ్జనార్ స్పష్టం చేశారు.
కొంత మంది సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను ఉపయోగించి స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని, అందువల్ల అమాయకులు మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు ఈజీ మనీ వలలో పడకుండా, కష్టపడి సంపాదించాలని సూచించారు.
Details
హర్ష సాయి తప్పుడు వాదనలు
హర్ష సాయి తనను సమర్థించుకునేందుకు, తాను ప్రమోట్ చేయకపోతే, ఎవరో చేస్తారని తప్పుడు వాదన వినిపిస్తున్నారని, ఇది సరైన ధోరణి కాదని సజ్జనార్ మండిపడ్డారు.
అంతేగాక ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని వింటున్నామని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ఆలోచించాలన్నారు.
మీరు ఫాలో చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు మీ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఇలాంటి వారిని వెంటనే అన్‌ఫాలో చేసి, వారి అకౌంట్లను రిపోర్ట్ చేయాలన్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాను అంతమొందించడంలో ప్రజలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సజ్జనార్ సూచించారు.