
సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు 2023ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది.
అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు
. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2023 కోసం మొత్తం 21,84,117 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 21,65,805 ఎగ్జాకు హాజరయ్యారు. వీరిలో 20,16,779 మంది విద్యార్థులు అంటే 93.12 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అభ్యర్థులు ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు
cbseresults.nic.in
cbse.nic.in
cbse.gov.in
digilocker.gov.in
results.gov.in
parikshasangam.cbse.gov.in
పరీక్ష
ఫలితాలు ఇలా చూసుకోవాలి
1. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in కు వెళ్లాలి. దాని లింక్‌పై క్లిక్ చేయాలి.
2. సీబీఎస్ఈ రూల్ నంబర్ నమోదు చేయాలి.
3.పాఠశాల నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
4. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే, ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
5. మార్క్ షీట్‌ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.