
CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకొండి ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
మంగళవారం ఉదయం బోర్డు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది.
విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి cbse.gov.in లేదా https://cbseresults.nic.in/ అనే వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు.
ఫలితాలను చూడడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇదే కాకుండా, డిజీలాకర్ యాప్, ఉమాంగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారానూ ఫలితాలను పొందడం సాధ్యమే.
ప్రస్తుతం సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలపై మాత్రం స్పష్టత లేదు.
వివరాలు
సీబీఎస్‌ఈ బోర్డు మెరిట్ జాబితాలను విడుదల చేయకూడదనే నిర్ణయం
అయితే ఇవి కూడా ఈరోజే ప్రకటించే అవకాశం ఉందని సూచనలు కనిపిస్తున్నాయి.
ఇకపోతే, దేశవ్యాప్తంగా 7,842 కేంద్రాల్లో, అలాగే విదేశాల్లోని 26 దేశాల్లో నిర్వహించిన సీబీఎస్‌ఈ పదో తరగతి,పన్నెండో తరగతి పరీక్షలకు సుమారు 42 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో 24.12 లక్షల మంది పదో తరగతి, 17.88 లక్షల మంది పన్నెండో తరగతి పరీక్షలు రాశారు.
ఈ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించారు. విద్యార్థుల్లో అనవసరమైన పోటీ భావాలను దూరం చేసేందుకు, గత కొన్ని సంవత్సరాలుగా సీబీఎస్‌ఈ బోర్డు మెరిట్ జాబితాలను విడుదల చేయకూడదనే నిర్ణయం తీసుకుంది.
ఈ విధానం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది.