81కోట్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అదేంటంటే?
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కరోనా ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ఇంకో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. 81కోట్ల మందికి రేషన్‌ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ అధ్యక్షత కేంద్ర కేబినెట్‌నిర్ణయం తీసుకుంది. అంత్యోదయ అన్నయోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగతా వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తెలిపారు. సబ్సిడీలో పొందే.. గోధుమలు, చక్కెర, ఇతర చిరుధాన్యాలను ఫ్రీ రేషన్‌లో భాగంగా ఉచితంగా పొందవచ్చు.
రూ. 2లక్షల కోట్ల భారం
ఉచిత రేషన్ వల్ల కేంద్రంపై దాదాపు రూ. 2లక్షల కోట్ల భారం పడుతుందని, దీన్నికేంద్రమే భరించనున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పేదలకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం అందించే.. ఈ ఫ్రీ రేషన్‌ను న్యూ ఇయర్‌గా చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 81.35 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. దేశంలో కరోనా మొదటలైనప్పటి నుంచి కేంద్రం పేదలకు తిండిగింజలను ఉచితంగా అందిస్తోంది. తాజాగా నిర్ణయంతో 2023 చివరి నాటికి ఫ్రీ రేషన్ అందుబాటులో ఉండనుంది.