Loading...
Kuno National Park: కూనోలో చిరుత మృతి.. విచారణకు కేంద్ర ప్రత్యేక బృందం
కూనోలో చిరుత మృతి.. విచారణకు కేంద్ర ప్రత్యేక బృందం

Kuno National Park: కూనోలో చిరుత మృతి.. విచారణకు కేంద్ర ప్రత్యేక బృందం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుతల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని షియోపూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 19 నెలల మగ చిరుత చికిత్స పొందుతూ మృతి చెందింది. KNG22గా గుర్తించిన ఈ చిరుత మృతితో భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధ్యులను గుర్తించేందుకు విచారణకు ఆదేశించింది.

వివరాలు 

చిరుత శరీరంలో ఐదు బుల్లెట్లు

మూడు రోజుల క్రితం షియోపూర్ ప్రాంతీయ అటవీ విభాగం పరిధిలోని అడవుల్లో ఓ మగ చిరుత తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు.

వెంటనే స్పందించిన అటవీ అధికారులు దాన్ని రక్షించి చికిత్స కోసం వైద్య కేంద్రానికి తరలించారు.

అయితే, చిరుత ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించడంతో వైద్యులు ఎక్స్‌రే, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో చిరుత శరీరంలో ఐదు బుల్లెట్లు ఉన్నట్లు బయటపడింది.

వాటి కారణంగా అంతర్గత అవయవాలు, నరాల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.

దీంతో అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి బుల్లెట్లను బయటకు తీసినప్పటికీ, చిరుత ప్రాణాలను కాపాడలేకపోయారు.

వివరాలు 

స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. ఉన్నత స్థాయి విచారణ

అభయారణ్యంలోకి చొరబడి చిరుతపై కాల్పులు జరిపిన ఘటనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

ఈ దాడి వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందా? లేదా ఆకతాయిల చర్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.

ఘటనకు బాధ్యులను గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ, పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ టాస్క్ ఫోర్స్‌-STF)ను ఏర్పాటు చేసింది.

అటవీ ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపై నిఘా పెంచినట్లు సీనియర్ అటవీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

మరో చిరుతకు గాయాలు.. అప్రమత్తమైన పర్యవేక్షణ బృందాలు

ఇదిలా ఉండగా,కూనో జాతీయ ఉద్యానవనానికి చెందిన మరో 19నెలల మగ చిరుత గాయాలతో కనిపించడం కలకలం రేపింది.

'నిర్వా' అనే ఆడ చిరుతకు జన్మించిన ఈ పిల్ల చిరుతను అక్టోబర్ 25 సాయంత్రం మొరేనా అటవీ ప్రాంతంలో పర్యవేక్షణ సిబ్బంది గుర్తించారు.

గాయాలతో ఉన్న దాన్ని వెంటనే రక్షించి కూనో జాతీయ ఉద్యానవనానికి తరలించారు.

ప్రస్తుతం అక్కడి వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

తక్కువ వ్యవధిలోనే రెండు చిరుతలు గాయపడటం, వాటిలో ఒకటి ప్రాణాలు కోల్పోవడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అటవీ ప్రాంతాల్లో చిరుతలకు తగిన భద్రత ఉందా? పర్యవేక్షణలో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

ఈ ఘటనల వెనుక కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT