Page Loader
తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి
రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి

తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2023
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 31 మంది మృతి చెందారు. ఈ క్రమంలో తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను అధిగమించేందుకు రూ. 900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు కేంద్రం ఇప్పటికే రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులను విడుదల చేసిందని సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రాంతీయ వాతావరణ కేంద్రం గురించి కూడా సీతారామన్ మాట్లాడుతూ, చెన్నైలో మూడు డాప్లర్‌లతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని,వాటి వల్లే టెన్'కాశి,కన్యాకుమారి,తిరునల్వేలి, టుటికోరిన్‌లలో డిసెంబర్ 17న భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిసిందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి