Loading...
Hyd Metro: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా: రూ.275 కోట్లు మంజూరు..
హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా: రూ.275 కోట్లు మంజూరు..

Hyd Metro: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా: రూ.275 కోట్లు మంజూరు..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రూ.125 కోట్లను రుణం రూపంలో అందించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రెండో దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా కేంద్రం నిధులు మంజూరు చేయడంతో రెండో దశ పనులకు ఆర్థికంగా మరింత తోడ్పాటు లభించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హైదరాబాద్‌ మెట్రో.. రెండో దశకు రూ.275కోట్లు మంజూరు

ADVERTISEMENT