Loading...
Ration Card Update: రేషన్ కార్డుదారులకు అలర్ట్‌.. 1.58 కోట్ల కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం
కేంద్రం కీలక నిర్ణయం

Ration Card Update: రేషన్ కార్డుదారులకు అలర్ట్‌.. 1.58 కోట్ల కార్డులు రద్దు కాబోతున్నాయ్..! కేంద్రం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. రేషన్ వ్యవస్థలోని నకిలీ, డూప్లికేట్, క్రియాశీలంగా లేని,అనుమానాస్పద లబ్ధిదారులను గుర్తించి డేటాబేస్‌ను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 15.8మిలియన్లు అంటే సుమారు 1.58కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ ఎంటైటిల్‌మెంట్లను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఆ లబ్ధిదారుల రేషన్ కార్డులను వెంటనే శాశ్వతంగా రద్దు చేయరు. తొలుత వాటిని తాత్కాలికంగా డిసేబుల్ చేస్తారు. అర్హత ఉన్న నిజమైన లబ్ధిదారులు తమ వివరాలను ధ్రువీకరించుకునేందుకు మూడు నెలల సమయం ఉంటుంది.

వివరాలు 

ఆరు నెలలు రేషన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది?

ఈ వ్యవధిలో e-KYC పూర్తి చేయడంతో పాటు, అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే రేషన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం గత ఆరు నెలల్లో రేషన్ కార్డుపై కేటాయించిన ఆహార ధాన్యాలను వినియోగించని కార్డులను 'సైలెంట్ రేషన్ కార్డులు'గా పరిగణిస్తున్నారు.

కేంద్రం సవరించిన Targeted Public Distribution System (Control)Order ప్రకారం..ఆరు నెలలుగా రేషన్ వినియోగించని కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో e-KYC, ఫీల్డ్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల ద్వారా సంబంధిత లబ్ధిదారుడి అర్హతను మరోసారి పరిశీలించాలి.

అంటే ఆరు నెలలుగా రేషన్ తీసుకోలేదని కారణంగా కార్డు శాశ్వతంగా రద్దయినట్లు భావించాల్సిన అవసరం లేదు.

వివరాలు 

అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం

తొలుత కార్డును తాత్కాలికంగా నిలిపివేసి,తమ అర్హతను నిరూపించుకునేందుకు లబ్ధిదారులకు అవకాశం కల్పించడం ఈ విధానంలో కీలక అంశం.

కేంద్ర ఆహార,ప్రజా పంపిణీ శాఖ సెప్టెంబర్ 1, 2026న రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార శాఖ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించినట్లు సమాచారం.

ఈ ప్రక్రియను కఠినంగా అమలు చేసేందుకు కొత్త Standard Operating Procedures(SOPs)జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

రేషన్ డేటాబేస్‌లోని వివరాలను మరింత కచ్చితంగా నిర్వహించడం,అర్హత ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ఆహార ధాన్యాల ప్రయోజనం అందేలా చూడటం ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

నకిలీ,డూప్లికేట్,క్రియాశీలంగా లేని లేదా అనుమానాస్పద లబ్ధిదారులను గుర్తించడం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నారు.

ADVERTISEMENT