Telangana: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల ప్రవేశాల కోసం స్థానికులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో 33 లోని సవరణ 3(ఏ)ను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 85శాతం స్థానిక కోటా కింద నేషనల్ స్థాయిలో ప్రవేశాలు అందించడాన్ని తప్పని సరిగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థుల స్థానికత ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను నిరాకరించకూడదని ఆదేశించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద, ఈ కేసును వెంటనే విచారించాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది అభ్యర్థించారు. సీజేఐ ధర్మాసనం, త్వరలో విచారణ చేపడతామని తెలిపింది.