Chandrababu: కిందపడబోయిన చంద్రబాబు.. తృటిలో తప్పిన ప్రమాదం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టిడిపి 'రా కదలిరా' కార్యక్రమానికి టిడిపి నేతలు,కార్యకర్తలు భారీగా వచ్చారు. స్టేజీపై ఉన్న చంద్రబాబుకు దండ వేసేందుకు ఒక్కసారిగా ఎగబడడంతో స్టేజి పైన ఉన్న చంద్రబాబు క్రిందపడబోయారు. దింతో స్టేజిపైన ఉన్న సెక్యూరిటీ అపప్రమత్తమై చంద్రబాబును క్రింద పడకుండా పట్టుకున్నారు. ఈ క్రమంలో.. జరిగిన తోపులాటపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు,మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి,మాజీ మంత్రులు కెఎస్ జవహర్,ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఈ సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.