Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు(High Court) రూ. లక్ష పూచికత్తుతో బాబుకు బెయిల్ మంజూరు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో 70 మందికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్లు(Angallu) కూడలి వద్ద జరిగిన ఘటనపై పోలీసులు అగస్టు 8న చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును అశ్రయించారు.
Details
అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్
అధికార పార్టీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారని చంద్రబాబు తరుఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అందుకు సంబంధించిన వీడియోలను కూడా కోర్టుకు సమర్పించారు.
రాజకీయ ప్రతీకారంతో కేసు పెట్టామనడంలో వాస్తవం లేదని, బెయిల్ పిటిషన్ కొట్టేయాలని పోలీసుల తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చంద్రబాబుకు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.