
Chandrababu: హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌పై కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
ఈ కేసులో విచారణ చేస్తున్న ఏసీబీ (ACB) కోర్టు చంద్రబాబు బెయిల్ పిటీషన్‌ను తిరిస్కరించింది. దీంతో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టు(High Court ) ను అశ్రయించారు.
తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటీషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించిన న్యాయస్థానం విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
బెయిల్ మంజూరు చేయాలని బుధవారం ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు.
అయితే ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.
Details
రాజకీయ ప్రతీకారంతోనే అరెస్టు చేశారు : చంద్రబాబు
రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని, కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రజా జీవితంలో ఉన్న తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.
ఇక అమరావతి ఇన్నర్‌రింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌లో హైకోర్టు సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
17వ తేదీన స్కిల్ కేసులో బెయిల్ విచారణకు వస్తుండటంతో ఆ రోజు కోర్టు నిర్ణయం ఆధారంగా బెయిల్ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.