Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించాయి.
సమావేశం అనంతరం చంద్రబాబు తన స్పందనను తెలియజేస్తూ, బిల్ గేట్స్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ కలిసి ఎలా పని చేయాలన్న దానిపై చర్చించినట్లు వెల్లడించారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి ముఖ్య రంగాల్లో సేవలను మరింత మెరుగుపరచేందుకు కృత్రిమ మేధ (AI) వంటి ఆధునిక టెక్నాలజీల వినియోగంపై చర్చించారు.
Details
బిల్ గేట్స్ కి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ లక్ష్యాల సాధనలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకమని, బిల్ గేట్స్ అందించిన సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన అభినందించారు.
అదేవిధంగా, బిల్ గేట్స్ ఇవాళ పార్లమెంటులో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఇది గేట్స్ మూడు సంవత్సరాలలో భారతదేశానికి చేస్తున్న మూడో పర్యటన.
అయితే ఆయన ఇంకా ఎవరెవరిని కలుసుకోనున్నారన్నదానిపై స్పష్టత లేదు.