Page Loader
 ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

 ఉత్తర్‌ప్రదేశ్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు

వ్రాసిన వారు Stalin
Jun 28, 2023
06:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో బుధవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తులు హర్యానా లైసెన్స్ ప్లేట్ ఉన్న కారులో సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం వారు చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరపడంతో అతను గాయపడినట్లు పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో భీమ్ ఆర్మీ చీఫ్ టయోటా ఫార్చ్యూనర్ కారులో ప్రయాణిస్తున్నారు. వాహనం సీటు, డోర్ రెండింటిపై బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. దాడి చేసేవారు వెనుక నుంచి కారు వద్దకు వచ్చి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. దాడి సమయంలో కనీసం నాలుగు తుపాకులు పేలి ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఆజాద్‌ను ఆస్పత్రికి తరలించిన దృశ్యం