Page Loader
Jammu and Kashmir: వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు..
వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు..

Jammu and Kashmir: వక్ఫ్ సవరణ చట్టంపై జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలో ఆందోళనలు.. ప్రతులను చింపివేసిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో నూతన వక్ఫ్ సవరణ చట్టంపై గందరగోళం నెలకొంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేతృత్వంలోని మహా కూటమి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే, అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ అంశం ఇప్పటికే సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున, దానిపై సభలో వాయిదా తీర్మానం ద్వారా చర్చించలేమని, అసెంబ్లీ నియమావళి ప్రకారం అది అనుమతించదగినది కాదని స్పీకర్ స్పష్టం చేశారు. దీనితో అసంతృప్తి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం వరకు వచ్చి, జోరుగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

వివరాలు 

నినాదాలతో నిరసన 

"వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి - బన్ కరో బన్ కరో వక్ఫ్ బిల్లు కో బన్ కరో" అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్ లోన్ మాట్లాడుతూ, ఈ విధానంతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు తూట్లు పొడిచినట్లేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. "మా భావోద్వేగాలను గౌరవించాలి. మీరు చట్ట పాలనను, సమాఖ్యవాదాన్ని, లౌకికత్వాన్ని బహిరంగంగా భంగపెడుతున్నారు" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వక్ఫ్ చట్టంపై తమ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించక పోవడంతో నిరసన..