Bharat Ratna: దేశ మాజీ ప్రధానులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు,చౌదరి చరణ్‌సింగ్,వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించారు. సాధారణంగా ఏడాదికి మూడు భారతరత్న అవార్డులు ఇస్తారు.అయితే, ఈ సంవత్సరం,సీనియర్ బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ,బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో సహా ఐదుగురిని ప్రభుత్వం భారతరత్నకు ఎంపిక చేసింది. "మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము.విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,కేంద్ర మంత్రిగా,అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషికి ఆయన సమానంగా గుర్తుండిపోతారు అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.