Revanth Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు.. సీఎం రేవంత్ ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉన్న యూనివర్సిటీలు, సంస్థలు పరిపాలనా సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమస్యను నివారించేందుకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని తెలిపారు.
శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లుల ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.
Details
పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక యూనివర్సిటీ పేర్లను మార్చామని, పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లను కొన్ని యూనివర్సిటీలకు పెట్టామని వివరించారు.
అదే విధంగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎంతో విలువైనవని, గోల్కొండ పత్రికను నడిపి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.
Details
బల్కంపేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు
దివంగత మాజీ సీఎం రోశయ్య, ఆర్యవైశ్య సమాజంపై ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం అన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందడం సరికాదని వ్యాఖ్యానించారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టేందుకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖ రాస్తామని తెలిపారు.
దేశం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
బల్కంపేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు నేచర్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.