Loading...
CII Partnership Summit: విశాఖలో 31వ సీఐఐ సదస్సు ప్రారంభం.. రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
విశాఖలో 31వ సీఐఐ సదస్సు ప్రారంభం.. రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

CII Partnership Summit: విశాఖలో 31వ సీఐఐ సదస్సు ప్రారంభం.. రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, దాదాపు 59 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

2.46 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం మొత్తం 141 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోనుంది.

వీటి ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ పెట్టుబడులతో దాదాపు 2.46 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది.

సదస్సు ప్రారంభానికి ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

వివరాలు 

పవన్ కల్యాణ్ కు ఇన్వెస్టర్ల వివరాలు 

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్ల వివరాలను ఈ సందర్భంగా పవన్‌కు వివరించారు.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న లోకేశ్‌ను పవన్ అభినందించారు. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లోనూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

పారిశ్రామిక రంగంలో వృద్ధిని ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా (గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్) తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

ADVERTISEMENT