CJP: ఎద్దేవాతో మొదలై దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సీజేపీ.. 2 కోట్ల ఫాలోవర్లతో సంచలనం
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) సోషల్ మీడియాలో ఊహించని ఆదరణను సొంతం చేసుకుంది. అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినా, కేవలం జెన్-జీ ఉద్యమంగా ప్రారంభమైన ఈ ప్రచారం ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్, బీజేపీలను దాటేసి ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా మొదలైన ఈ ఉద్యమం, చివరకు కేంద్ర మంత్రితో రాజీనామా చేయించే స్థాయికి చేరుకుంది.
వివరాలు
ఎలా మొదలైంది సీజేపీ?
బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అభిజీత్ దీప్కే 2026 మే 16న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఈ ఉద్యమానికి కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే. **"కొందరు యువత బొద్దింకల్లాంటివాళ్లు. వారికి ఉద్యోగాలు ఉండవు. వృత్తుల్లోనూ ఉండరు. వారిలో కొందరు పాత్రికేయులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం ప్రచారకర్తలుగా మారి అందరిపైనా దాడులు చేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ అభిజీత్ దీప్కే ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు.
అయితే, తాను ఊహించని స్థాయిలో వేలాది, లక్షలాది మంది యువత ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సైన్‌అప్ కావడంతో సీజేపీ వేగంగా దేశవ్యాప్త చర్చగా మారింది.
వివరాలు
సోషల్ మీడియాలో సంచలనం
ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే సీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 2 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ను నమోదు చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
సీజేపీ ప్రధాన నాయకులు సీజేపీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాన నాయకులు మొత్తం 10 మంది. వారిలో:
అభిజీత్ దీప్కే
సౌరవ్ దాస్
అశుతోశ్ రంకా
విజేత దహియా
సోనమ్ వాంగ్‌చుక్
ప్రకాష్ రాజ్
అతుల్ కులకర్ణి
అమూల్య ధవన్
రోనక్ ఖత్రీ
అర్పిత్ శర్మ
వివరాలు
సీజేపీ సంచలన మ్యానిఫెస్టో
ఒకవేళ సీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలుగా తమ మ్యానిఫెస్టోలో పలు ప్రతిపాదనలు ప్రకటించింది.
ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ అనంతరం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకూడదు.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఓటు తీసేస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)పై ఉపా (UAPA) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి.
మహిళలకు చట్టసభల్లోనూ, మంత్రివర్గంలోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
అంబానీ, అదానీ గ్రూపులకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి.
ఎమ్మెల్యే లేదా ఎంపీ పార్టీ మారితే 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఎలాంటి పదవి చేపట్టకుండా నిషేధం విధించాలి.
వివరాలు
ఉద్యమం ఎలా విస్తరించింది?
జూన్ 6న అభిజీత్ దీప్కే అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ సంఖ్యలో యువత చేరుకున్నారు.
అప్పటి నుంచే ఉద్యమం డిజిటల్ ప్రచారంతో పాటు ప్రత్యక్ష ఆందోళనల రూపం దాల్చింది. జూన్ 20న జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం జూన్ 22 నుంచి 27 వరకు వేలాది మంది యువత నిరసనల్లో పాల్గొన్నారు.
జూన్ 28న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జంతర్‌మంతర్‌కు చేరుకుని నిరాహార దీక్ష ప్రారంభించారు.
దీంతో ఉద్యమం మరింత ఉద్ధృతమై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.