LOADING...
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ .. కిశ్త్‌వాడ్‌లో  బురదలో కూరుకుపోయిన వాహనాలు
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ .. కిశ్త్‌వాడ్‌లో బురదలో కూరుకుపోయిన వాహనాలు

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ .. కిశ్త్‌వాడ్‌లో  బురదలో కూరుకుపోయిన వాహనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో మేఘ విస్ఫోటం సంభవించి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో రహదారులు పూర్తిగా బురదమయంగా మారగా, భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిశ్త్‌వాడ్‌లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతంలో బురద, రాళ్ల ప్రవాహం భారీగా చేరడంతో పలు వాహనాలు కింద కూరుకుపోయాయి. వాటిని వెలికితీసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

వివరాలు 

బురదలో చిక్కుకుపోయిన వాహనాలు, ఇతర భారీ యంత్రాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. వాహనాలతో పాటు మిల్లులు, ఇతర భారీ యంత్రాలు కూడా బురదలో చిక్కుకుపోయాయని వెల్లడించారు. బురద, రాళ్లను తొలగించి వాహనాలు, యంత్రాలను బయటకు తీసేందుకు భారీ యంత్రాల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, భారత సైన్యం, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రజలు, పర్యాటకులకు అత్యవసర సహాయం అందించేందుకు అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి బీభత్సం.. కిశ్త్‌వాడ్‌లో వరదలతో రాకపోకలు స్తంభనం

Advertisement