తదుపరి వార్తా కథనం
Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం.. 1,600 మంది పేదలకు లబ్ధి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 01, 2025
03:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం ప్రకటించారు.
2025లో చంద్రబాబు నాయుడు తన తొలి సంతకం చేస్తూ, రూ.24 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా 1,600 మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
గత ఏడాది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబరు 31 వరకు, సీఎంఆర్‌ఎఫ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.124.16 కోట్ల నిధులు విడుదల చేసి, 9,123 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించింది.