Page Loader
Chandrababu Naidu:  సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ముప్పు ..
సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ముప్పు

Chandrababu Naidu:  సీఎం చంద్రబాబుకు తప్పిన పెను ముప్పు ..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆయనకు ట్రైన్ కేవలం మూడు అడుగుల దూరంలో ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లు అయింది. భారీ వర్షాలు కారణంగా విజయవాడ నగరంలో వరదలు ఇంకా కొనసాగుతున్నాయి, కొన్ని ప్రాంతాలలో బుడమేరు వరద ఇంకా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో, సహాయ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు.

వివరాలు 

లైన్‌మెన్‌ను అప్రమత్తం చేసిన కార్యకర్తలు

ఈ క్రమంలో, సీఎం చంద్రబాబు ముధరా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్ళుతుండగా, రైలు ట్రాక్‌పై వస్తున్నట్లు గమనించిన భద్రతా సిబ్బంది, ఆయనను అక్కడి నుంచి వెళదామని చెప్పారు. ఇదే సమయంలో, చంద్రబాబు చుట్టూ ఉన్న కార్యకర్తలు లైన్‌మెన్‌ను అప్రమత్తం చేశారు. లైన్‌మెన్ రైలుకు ఎర్రజెండా ఊపడంతో రైలు స్లో అయ్యింది. చివరకు, రైలు కేవలం మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఈ ఘటనతో, భద్రతా సిబ్బంది ఎంతో సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు.