CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి. ఆర్. పాటిల్‌తో కూడా భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, నిధుల మంజూరు వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు.
వివరాలు
భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌కు హాజరు
తర్వాత సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్‌తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు.