Page Loader
CM KCR: ఎమ్మెల్యేనే ఫైన‌ల్ కాదు.. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్
ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్

CM KCR: ఎమ్మెల్యేనే ఫైన‌ల్ కాదు.. ఎన్నో అవ‌కాశాలు ఉంటాయి: సీఎం కేసీఆర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 15, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ కేంద్ర పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుతానికి రెడీగా ఉన్న 51 బీ-ఫారాలు పంపిణీ చేస్తున్నామని, మిగ‌తావి రేపు అందించి పూర్తి చేస్తామన్నారు. బీ-ఫారాలు నింపేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా వ్యవహరించాలని, పొర‌పాట్లు చేయొద్ద‌ని సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులుగా సెలెక్ట్ కాకపోతే తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికవ్వడమే ఫైనల్‌ కాదన్నారు. మున్ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయని అభ్యర్థులు, పార్టీ ఎన్నికల ఇంఛార్జీలతో సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు రెండు కార్యక్రమాలు ఉన్నాయన్న కేసీఆర్, ముందుగా పార్టీ మేనిఫెస్టో ప్రకటించుకుని, బీఫారాల పంపిణీ ముగించుకుని, హుస్నాబాద్‌కు వెళ్లాల్సి ఉందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే టికెట్లు రావడం సంతోషంగా ఉందన్నారు.

details

అహంకారం వద్దు, ప్రతీ కార్యకర్తకు సమాధానం ఇవ్వాలి..

అయితే కొన్ని చోట్ల మాత్రమే మార్పులు అవసరమయ్యాయన్నారు. వేముల‌వాడ‌లో మార్చుకోవాల్సిన పనిలేకున్నా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులతోనే అభ్యర్థిని మార్చాల్సి వ‌చ్చిందన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, ప్రజ‌ల‌కు దండం పెట్టి ఓటు కావాల‌ని అడుగుతామన్నారు. కార్యకర్తల కంటే ఎక్కువ‌గా అభ్యర్థులే ప్రజ‌ల్లో ఉండాలని, కోపతాపాలు ఉండకూదన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఒక‌రిద్దరికి చెబితే వినలేదని, ఫలితంగా ఓడిపోయారన్నారు. ఆ జాబితాలో జూప‌ల్లి కృష్ణారావు ఇత‌ర నాయ‌కుల‌తో మాట్లాడ‌క అహంకారంతో ఓడిపోయారన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఘ‌ట్టమని, మంచిగా మాట్లాడ‌టం నేర్చుకోవాలని, కార్యక‌ర్తల‌కు మ‌న‌ల్ని నిలదీసే అధికారం ఉంటుందన్నారు.ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని సూచించారు. గెలవలేక సాంకేతికంగా శ్రీనివాస్ గౌడ్, వ‌న‌మా, కృష్ణ‌ మోహ‌న్ రెడ్డి మీద కేసులు పెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు.

details

భరత్ తో మాట్లాడండి, సమస్యలు పరిష్కరించుకోండి : కేసీఆర్

ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌మాషాలు చూస్తుంటామని, ఎన్నిక‌ల్లో నిబంధ‌న‌లు మారుస్తుంటారని కేసీఆర్ అభ్యర్థులకు గుర్తు చేశారు. ప్ర‌తిది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలని, మాకు తెలుసులే అని అనుకోవ‌ద్దన్నారు. 98480 23175 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే భ‌ర‌త్ కుమార్ 24 గంట‌లు అందుబాటులో ఉంటారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వార‌ధిగా ఆయన ప‌ని చేస్తున్నారన్నారు. అభ్య‌ర్థుల‌కు సందేహాలు వ‌స్తే ఒక్క ఫోన్ కొడితే నిమిషాల్లోనే ప‌రిష్కారం చూపిస్తారన్నారు. నామినేష‌న్ల విష‌యంలో అప్రమత్తంగా ఉండాలని, చివ‌రి రోజున నామినేష‌న్లు వేసేందుకు ప్ర‌య‌త్నించొద్దన్నారు. బీ-ఫారాలు నింపేట‌ప్పుడు అప్డేట్ ఓట‌ర్ జాబితానే అనుసరించాలని సూచించారు.